COVID-19 (నోవల్ కరోనావైరస్) - వాషింగ్టన్ రాష్ట్రంలోని సమాచారం, సేవలు మరియు వనరులు

కొవిడ్-19 హాట్‌లైన్: కార్మికులు, వ్యాపారాలు, వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్‌ మరియు మరిన్నింటికి సహాపడుతుంది

కొవిడ్-19 గురించి మీకు సందేహాలుంటే లేదా వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి సహాయం అవసరమైతే, దయచేసి, 1-800-525-0127 కాల్‌ చేయండి మరియు # నొక్కండి. వారు స్పందించి నప్పుడు, ఇంటర్‌ప్రిటివ్ సేవలు పొందడానికి మీ భాష పేర్కొనండి. హాట్‌లైన్‌ రోజూ తెరిచి ఉంటుంది మరియు Department of Health యొక్క వెబ్‌సైట్‌లో దీని పని గంటలు జాబితా చేయబడి ఉంటుంది (ఇంగ్లీష్‌లో మాత్రమే).

ఒక కార్యకలాపాల ఉల్లంఘనను ఫిర్యాదు చేయండి

సిబ్బంది మరియు వినియోగదారులు తగిన ఆరోగ్యం మరియు సురక్షిత చర్యలను అమలు చేసుకో వడం వ్యాపారాలకు అవసరం. మీరు ఒక ఉల్లంఘనను ఫిర్యాదు చేయాలనుకుంటే, దయచేసి పైన పేర్కొన్న కొవిడ్-19 హాట్‌లైన్‌ నెంబర్‌కు మీ భాషలో సహాయం కోసం కాల్‌ చేయండి. ఉల్లంఘన గురించి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు మరియు మీ తరుపున ఫిర్యాదు సమర్పించ మంటారు. ఒక ఫిర్యాదును సమర్పించడానికి మీ పేరు లేదా సంప్రదింపు సమాచారాన్ని మీరు భాగస్వామ్యం చేయాల్సిన అవసరం లేదు.

పైన మీరు ఇంగ్లీష్‌లో కూడా ఫిర్యాదు దాఖలు చేయగలరు. మీరు కొవిడ్-19 ఉల్లంఘన పేజీలో ఇంగ్లీష్‌లో కూడా ఫిర్యాదు దాఖలు చేయగలరు.

దయచేసి గుర్తించండి, మీ పేరు మరియు సంప్రదింపు సమాచారాన్ని అందిస్తే, అదే సమాచారం కోసం ఎవరైనా పబ్లిక్‌ రికార్డ్స్‌ కోసం విజ్ఞప్తి చేస్తే వెల్లడించవచ్చు. గవర్నర్ యొక్క గోప్యతా సూచన (ఇంగ్లీష్‌లో మాత్రమే) లో వివరించబడిన రికార్డ్‌లు రాష్ట్రం యొక్క పబ్లిక్‌ రికార్డ్స్‌ చట్టం RCW 42.56 కింద అవసరమైనట్లుగా విడుదల చేయబడతాయి.

కార్మికులు, వ్యాపారాలు, సంస్థలకు మరింత సహాయం

అనువాదసేవలను ఉపయోగించుకొని, హాట్‌లైన్‌ మిమ్మల్ని సాధారణ మార్గదర్శకం మరియు వనరులకు మరలిస్తుంది. మీకు ఇంకా ఇంకా ప్రశ్నలుంటే, కొవిడ్-19 కార్యకలాపాలు మరియు కార్మిక విచారణ ఫారం భర్తీ చేయడానికి వారు సహాయపడవచ్చు. సంప్రదింపు సమాచారం గురించి మిమ్మల్ని అడుగుతారు దీంతో మీరు ఒక సమాధానాన్ని పొందవచ్చు.

కరోనా వైరస్ (COVID-19) వ్యాక్సిన్

కోవిడ్-19 వ్యాక్సిన్​లకు సంబంధించిన అదనపు సమాచారం కోసం, దయచేసి మా కోవిడ్-19 వ్యాక్సిన్ పేజీని సందర్శించండి.

WA నోటిఫై ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ల స్మార్ట్‌ఫోన్ యాప్
బొమ్మ
WA Notify ఎలా పనిచేస్తుంది

WA Notify (దీనిని) Washington Exposure Notifications(వాషింగ్టన్ ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​లు) అనేది ఒక ఫ్రీ టూల్, ఏదైనా వ్యక్తిగత సమాచారం పంచుకోకుండా కొవిడ్-19కు తాము ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చు అని యూజర్​లను అలర్ట్ చేసేందుకు స్మార్ట్​ఫోన్​లపై పనిచేసే పరికరం. ఇది పూర్తిగా వ్యక్తిగతం మరియు మీరు ఎవరు అని తెలియదు లేదా మీరు ఎక్కడకు వెళతారనేది జాడ పసిగట్టలేరు.

నేను నా పోన్​కు WA Notify ని ఎలా జోడించాలి?

iPhoneలోని, సెట్టింగ్లలో ఉన్న Exposure Notifications ను అనుమతించండి:

 • Settings (సెట్టింగ్​లు)కు వెళ్ళండి
 • Exposure Notifications వరకు కిందకు స్క్రోల్ చేయండి
 • “Exposure Notifications ఆన్ చేయండి” మీద క్లిక్ చేయండి
 • United States (యునైటెడ్ స్టేట్స్​ను) ఎంచుకోండి
 • వాషింగ్టన్​ను ఎంచుకోండి

Android ఫోన్లో:

 • Google Play Store కు వెళ్లండి
 • WA Notify యాప్ డౌన్​లోడ్ చేయండి

Android లేదా iPhone మీద, QR కోడ్ స్కాన్ చేయండి:

WA Notify QR code

ఇది ఎలా పని చేస్తుంది?

మీరు WA Notify ని అనుమతించినప్పుడు, మీ ఫోన్ మీకు సమీపంలో ఉన్న వారు ఎవరైనా WA Notify ని అనుమతించివుంటే ఆ వ్యక్తుల ఫోన్లతో గుర్తుతెలియని, రహస్య సంకేతాలను మార్పిడి చేసుకుంటుంది. మీ గురించి ఏదైనా సమాచారం వెల్లడించకుండానే ఈ యాదృచ్ఛిక కోడ్​లను మార్పిడి చేసుకునేందుకు ప్రైవరీ-ప్రిజర్వింగ్​లో ఎనర్జీ బ్లూటూత్ టెక్నాలజీని యాప్ ఉపయోగిస్తుంది. గడిచిన రెండు వారాల్లో మీరు దగ్గరగా ఉన్న మరో WA Notify యూజర్ తరువాత కొవిడ్-19 టెస్ట్​కు పాజిటివ్ అయితే, ఇతరులకు అనామధేయంగా నోటిఫై చేయడానికి దశలను అనుసరిస్తుంది, మీరు ఎక్స్​ప్లోజ్ అయ్యే సంభావ్యత ఉందని తెలియజేసే ఒక అనామధేయ సందేశాన్ని అందుకుంటారు. ఇది మీకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సత్వరమే అందేలా చేసి, మీరు మీ చుట్టుపక్కల వారికి కోవిడ్-19ను వ్యాపింపచేయకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

సురక్షితమైన దూరంలో లేదా మిమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం లేని స్వల్పకాలిక ఘటన నుంచి కొవిడ్-19 వ్యాప్తి చెందే సంభావ్యత ఉండే ఘటనలు గుర్తించడానికి అల్గారిథమ్ గణనలు చేస్తుంది. WA Notify మీరు ఎక్స్​ప్లోజ్ అయ్యే సంభావ్యత ఉన్నప్పుడు మాత్రమే అలర్ట్ చేస్తుంది. అందువల్ల అలర్ట్ అందుకోకపోవడం అనేది ఒక శుభవార్తే.

WA Notify 30 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమవుతోంది అందువల్ల వాషింగ్టన్ పౌరుల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ టూల్​ని యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇంటి వద్ద టెస్ట్ చేసినప్పుడు మీకు పాజిటివ్​వచ్చినట్లయితే ఎలా రిపోర్ట్ చేయాలి

ఓవర్-ద -కౌంటర్ టెస్ట్ కిట్​లు కొనుగోలు చేసి, పాజిటివ్ రిజల్ట్ వచ్చిన వ్యక్తులు, ఫలితాలు వచ్చిన వెంటనే సాధ్యమైనంత త్వరగా స్టేట్ కొవిడ్-19 హాట్​లైన్​1-800-525-0127కు కాల్ చేసి # ప్రెస్ చేయాలి (స్పానిష్ కొరకు 7 ప్రెస్ చేయండి). హాట్​లైన్ సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మంగళవారం నుంచి ఆదివారం (మరియు సెలవుదినాల్లో) వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు లభ్యమవుతుంది. భాషా సాయం లభ్యమవుతుంది.

మీరు కాల్ చేసేటప్పుడు, మీరు WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) యూజర్ అని వారికి తెలియజేయండి. బహిర్గతం కాగల ఇతర WA Notify యూజర్​లను అలర్ట్ చేయడానికి మీరు ఉపయోగించగల వెరిఫికేషన్ లింక్​ని హాట్​లైన్ సిబ్బంది మీకు అందించగలరు.

దయచేసి గమనించండి: WA Notify ఒక ఎక్​ప్లోజర్ నోటిఫికేషన్ టూల్. ఇది యూజర్​లు వారి టెస్ట్ ఫలితాలను నమోదు చేయడానికి డిజైన్ చేయబడలేదు.

నా గోప్యతను ఎలా పరిరక్షిస్తారు?

WA Notify Google Apple ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీ ఆధారితమైనది, మీ గోప్యతను సంరక్షించేందుకు డిజైన్ చేయబడింది. ఇది ఏదైనా లొకేషన్ లేదా వ్యక్తిగత డేటాను సేకరించకుండా లేదా వెల్లడించకుండా బ్యాక్​గ్రౌండ్​లో పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మీరు ఎవరు లేదా మీరు ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కేవలం చిన్నపాటి బరస్ట్​లను మాత్రమే ఉపయోగించడం ద్వారా, మీ బ్యాటరీ ప్రభావితం కాదు.

దీనిలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందం. యూజర్​లు ఎప్పుడైనా దీనిని ఎంచుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. యూజర్ గోప్యతను ఎలా పరిరక్షిస్తారనే దాని గురించి మరింత సమాచారం కోసం, WA Exposure Notifications గోప్యతా విధానాన్ని చూడండి.

టెక్ట్స్​లు మరియు నోటిఫికేషన్​లు ఎలా కనిపిస్తాయి?

మీరు రెండు రకాలైన నోటిఫికేషన్​లను అందుకోవచ్చు. పాజిటివ్​గా టెస్ట్ చేయబడినవారు ధృవీకరణ లింక్ టెక్ట్స్ సందేశం మరియు/లేదా పాప్-అప్ నోటిఫికేషన్​ని అందుకుంటారు. ఎక్స్​పోజ్ కాగల WA Notify యూజర్​లు ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​ని అందుకుంటారు. ఈ నోటిఫికేషన్​ల గురించి మరింత తెలుసుకోండి మరియు అవి ఎలా కనిపిస్తాయనేది చూడండి.

ఇది ఎలా సహాయపడుతుంది?

ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​ని ఎంత ఎక్కువ మంది వ్యక్తులు ఉపయోగిస్తే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, ఇటీవల University of Washington (ఇంగ్లిష్ మాత్రమే) జరిపిన అధ్యయనంలో కనుగొనబడింది. WA Notify దానిని ఉపయోగించడం ప్రారంభించిన మొదటి నాలుగు నెలల్లో సుమారుగా 40 -115 మరణాలను కాపాడినట్లుగాను మరియు సుమారుగా 5,500 కొవిడ్-19 కేసులను నిరోధించినట్లుగా ఫలితాలు తెలియజేస్తున్నాయి. WA Notify ని అతి తక్కువ మంది ఉపయోగించినా సరే కొవిడ్-19 సంక్రామ్యత మరియు మరణాల గణనీయంగా తగ్గించగలదని, డేటా మోడల్స్ చూపుతున్నాయి, కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు WA Notify ఒక అద్భుతమైన టూల్​గా రుజువు చేయబడింది.

WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) గురించి నోటి ప్రచారం చేయడం ద్వారా సాయపడాలని అనుకుంటున్నారా?

సోషల్ మీడియా మెసేజింగ్, పోస్టర్​లు, శాంపుల్ రేడియో మరియు టివి ప్రకటనలు, మరియు మరిన్నింటి గురించి మా WA Notify టూల్​కిట్​ ని చెక్ చేయండి.

ఇతర తరచుగా అడిగే ప్రశ్నలు

నేనుe Washington State Department of Health (DOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) నుంచి ఒక నోటిఫికేషన్ మరియు/లేదా టెక్ట్స్​ని అందుకున్నాను. ఎందుకు?

DOH కొవిడ్-19 కొరకు ఇటీవల పాజిటివ్​గా టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి టెక్ట్స్ సందేశం మరియు/లేదా టాప్ అప్ నోటిఫికేషన్​ని పంపుతుంది, తద్వారా WA Notify యూజర్​లు సంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి ఇతర యూజర్​లను వేగంగా, అనామధేయంగా అలర్ట్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్​ల గురించి మరింత తెలుసుకోండి మరియు అవి ఎలా కనిపిస్తాయనేది చూడండి.

మీరు రెండింటిని అందుకున్నట్లయితే, మీరు కేవలం నోటిఫికేషన్ తట్టాలి లేదా టెక్ట్స్ సందేశంలోని లింక్ మీద క్లిక్ చేయాలి, సంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి ఇతర యూజర్​లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లోని దశలను అనుసరించాలి.

నేను వ్యాక్సిన్ వేయించుకుంటే నాకు WA Notify కావాలా?

అవును. మీరు కొవిడ్-19కు విరుద్ధంగా పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, మీరు సాధారణ మహమ్మారి ముందస్తు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వ్యాక్సిన్​లు ఒక సమర్థవంతమైన మార్గం, కానీ, మీకు సంక్రమించడానికి లేదా వ్యాక్సిన్ వేయించుకోని ఇతరులకు సోకేందుకు చిన్నపాటి రిస్క్ ఉంది.

నా WA Notify డేటాను ప్రజారోగ్య వ్యవస్థకు అందించడం గురించి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు?

Washington State Department of Health (DOH), WA Notify ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నది. కాబట్టి మేము ఆ సాధనానికి అవసరమైన ఏవైనా మెరుగుదలలను చేయగలుగుతాము. మీరు మీ WA Notify డేటాను షేర్ చేయడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం దేనినీ సేకరించడం లేదా షేర్ చేయడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. DOH మాత్రమే ఈ డేటాను యాక్సెస్ చేయగలుగుతుంది, అదీ రాష్ట్ర స్థాయిలో మాత్రమే.

WA Notify వినియోగదారులు వారి డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తే, ఏమి సేకరిస్తారు?

మీరు మీ డేటాను షేర్ చేయడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం దేనినీ సేకరించడం లేదా షేర్ చేయడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. Washington State Department of Health మాత్రమే ఈ రాష్ట్ర-స్థాయి డేటాను చూడగలదు, దానిలో ఇవి ఉంటాయి:

 • తమ WA Notify డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల సంఖ్య. మా నమూనా ఎంత వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నదో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది.
 • WA Notify యూజర్​ల ద్వారా అందుకున్న Exposure Notifications సంఖ్య కోవిడ్-19వ్యాప్తికి సంబంధించిన ధోరణులను గమనించడానికి ఇది మాకు సహాయపడుతుంది.
 • ఎక్స్​పోజర్ నోటిఫికేషన్​పై క్లిక్ చేసే వ్యక్తుల సంఖ్య. ప్రజారోగ్య శాఖ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రజలు ఎంత సుముఖంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది.

కోవిడ్-19పాజిటివ్ అని పరీక్షలో తేలిన వారికి సన్నిహితంగా ఉన్నా, తగినంత సమయం లేని, ఎక్స్​పోజర్ గురించి నోటిఫై చేయదగినంత ఎక్కువ సమయం లేని వ్యక్తుల సంఖ్య. WA Notify లో ఎక్స్​పోజర్​ను నిర్ణయించే అల్గోరిథంను సర్దుబాటు చేయాల్సి ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఇది మాకు సహాయపడుతుంది.

నేను నా ఐఫోన్​లో WA Notify ని అనుమతించినప్పుడు, “ Availability Alerts (అందుబాటు హెచ్చరికలు)” మీటను నేను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేయాలా?

ఆఫ్ చేసినా ఫర్వాలేదు. మీరు గణనీయమైన సమయంపాటు వాషింగ్టన్ స్టేట్​కు వెలుపల ప్రయాణించినా సరే, మీరు దానిని ఆన్ చేసి ఉంచాలని సిఫారసు చేయబడుతోంది. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అందుబాటు హెచ్చరికలు ఆన్​లో ఉంటే, WA Notify కాని వేరే ఇతర ఎక్స్​పోజర్ నోటిఫికేషన్ సాంకేతికత నుంచి నోటిఫికేషన్​ను అందుకోవచ్చు. ఐఫోన్ వినియోగదారులు పలు ప్రాంతాలను జోడించగలరు కాని, ఒక సమయంలో ఒక ప్రాంతాన్ని మాత్రమే యాక్టివ్​గా ఉండేదిగా చేయగలుగుతారు. కొత్త దాన్నియాక్టివేట్ చేయడానికి ఒక ప్రాంతాన్ని తొలగించవలసిన అవసరం లేదు. Android యూజర్​లు అనేక రాష్ట్రాల నుంచి WA Notify లాంటి ఎక్స్​ప్లోజ్ నోటిఫికేషన్ యాప్​లను ఇన్​స్టాల్ చేసుకోవచ్చు, కానీ WA Notify కంపాటబుల్​గా ఉండే టెక్నాలజీని ఉపయోగించే యాప్ మాత్రమే ఒకేసారి యాక్టివ్ చేయబడుతుంది.

నేను WA Notify ని ఉపయోగించడాన్ని ప్రారంభించాలా?

అవును. WA Notify ఉచితము, స్వచ్ఛందము. మీరు ఎప్పుడైనా దానిని నిలిపివేయవచ్చు. కేవలం ఆ ఫీచర్​ను ఆపివేయండి లేదా ఆ యాప్​ను తొలగించండి. దగ్గరలోని ఇతర యూజర్​ల నుంచి వచ్చిన గుర్తుతెలియని సంకేతాలన్నీ ఫోన్​లో నుంచి తొలగిపోతాయి, వాటిని తిరిగి రాబట్టలేం.

WA Notify కాంటాక్ట్​ల జాడను కనిపెట్టే యాపా?

లేదు. WA Notify మీరు దగ్గరల్లో ఉన్న వ్యక్తుల గురించి సమాచారాన్ని ట్రాక్ చేయదు లేదా ట్రేస్ చేయదు, అందువల్ల ఇది "కాంటాక్ట్ ట్రేసింగ్" చేయదు. కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా బహిర్గతం చేసిన వ్యక్తిని గుర్తిస్తుంది. యాప్ ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు లేదా మార్పిడి చేయదు, అందువల్ల మీరు ఎవరితో సంప్రదించారో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

“ఎక్స్​పోజర్” అంటే ఏమిటి?

తరువాత కోవిడ్-19 పాజిటివ్​అని పరీక్షలో తేలిన మరొక WA Notify యూజర్​కు దగ్గరగా మీరు చెప్పుకోదగినంత సమయం గడిపినప్పుడు ఎక్స్​పోజర్ జరుగుతుంది. ఇది కొవిడ్-19 సామాజిక దూరం మరియు వ్యాప్తి గురించి CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఈ ప్రస్తుత మార్గదర్శనం అనుసరించండి (ఇంగ్లిష్ మాత్రమే). ఎక్స్​ప్లోజర్​ని నిర్ధారించడానికి, WA Notify క్లోజ్ కాంటాక్ట్​కు CDC ఇచచిన నిర్వచనం – సంక్రామ్యత సమయంలో సుమారు 6 అడుగులు (2 మీటర్లు) దూరంలో 15 నిమిషాలు ఉండటానికి అలైన్ అల్గారిథమ్​ని ఉపయోగిస్తుంది. వైద్య అధికారుల ద్వారా ఇది మార్చబడవచ్చు.

నేను ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చునని WA Notify నాకు తెలిపితే ఏమి జరుగుతుంది?

మీరు ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చని WA Notify గుర్తిస్తే, మీ ఫోన్​లోని ఒక నోటిఫికేషన్ మీరు తదుపరి ఏమి చేయాలి అనే సమాచారంతో కూడిన వెబ్​సైట్​కు దారి చూపుతుంది. దీనిలో ఎలా, ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి అనేది, మీరు, మీకు సన్నిహితంగా ఉండేవారు సురక్షితంగా ఉండటానికి సంబంధించిన సమాచారం, మీ ప్రశ్నలకు సమాధానాలు లభించే వనరులు ఉంటాయి. ఆ వెబ్​సైట్​లోని సూచనలను శ్రద్ధగా చదివి, వాటిని పాటించడం ముఖ్యం.

నాకు కోవిడ్-19 అని పరీక్షలో తేలితే అది అందరికీ తెలుస్తుందా?

లేదు. WA Notify మీ గురించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయదు. ఎవరికైనా వారు ఎక్స్​పోజర్​కు గురై ఉండే అవకాశం ఉన్నదనే నోటిఫికేషన్ అందినప్పుడు, వారికి గత 14 రోజులలో తమకు దగ్గరగా ఉన్న ఎవరికో కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలిందని మాత్రమే తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో లేదా ఎక్స్​పోజర్ ఎక్కడ జరిగిందో వారికి తెలియదు.

WA Notify కోసం నేను ఏమైనా చెల్లించాలా?

లేదు. WA Notify యాప్ ఉచితం.

WA Notify వాషింగ్టన్ రాష్ట్రానికి ఎలా సహాయపడుతుంది?

ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​ని ఎంత ఎక్కువ మంది వ్యక్తులు ఉపయోగిస్తే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, ఇటీవల University of Washington (ఇంగ్లిష్ మాత్రమే) జరిపిన అధ్యయనంలో కనుగొనబడింది. WA Notify దానిని ఉపయోగించడం ప్రారంభించిన మొదటి నాలుగు నెలల్లో సుమారుగా 40 నుంచి 115 మరణాలను కాపాడినట్లుగాను మరియు సుమారుగా 5,500 కొవిడ్-19 కేసులను నిరోధించినట్లుగా ఫలితాలు తెలియజేస్తున్నాయి. WA Notify ని అతి తక్కువ మంది ఉపయోగించినా సరే కొవిడ్-19 సంక్రామ్యత మరియు మరణాల గణనీయంగా తగ్గించగలదని, డేటా మోడల్స్ చూపుతున్నాయి, కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు WA Notify ఒక అద్భుతమైన టూల్​గా రుజువు చేయబడింది.

మీరు రాష్ట్రం బయటకు ప్రయాణించినప్పుడు WA Notify పని చేస్తుందా?

అవును. మీరు Apple/Google సాంకేతికతను ఉపయోగించే ఈ యాప్​ను వాడే రాష్ట్రానికి వెళితే, మీ ఫోన్ ఆ రాష్ట్రంలోని యూజర్​లతో గుర్తుతెలియని సంకేతాలను మార్పిడి చేసుకుంటూనే ఉంటుంది. మీ యాప్ సెట్టింగ్​లలో దేనినీ మార్చవలసిన అవసరం లేదు. మీరు ఎక్కువ కాలంపాటు వాషింగ్టన్ నుండి బయటకు వెళ్లినట్టయితే, స్థానికమైన సహాయం, హెచ్చరికలను పొందడం కోసం మీరు మీ కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఎంపికలను పరిశీలించాలి.

మనకు కాంటాక్ట్​లను కనిపెట్టడం, WA Notify రెండూ ఎందుకు అవసరం?

వ్యాధికి సంబధించిన కాంటాక్ట్​లను కనిపెట్టడం అనేది దశాబ్దాల తరబడి ప్రజారోగ్యం విషయంలో సమర్థవంతమైన జోక్యంగా ఉంటున్నది. WA Notify ఈ పనికి అజ్ఞాతంగా మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ: మీకు కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలితే, ప్రజారోగ్య శాఖ అధికారులు ఇటీవల మీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న వారి సమాచారాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు. బస్సులో మీకు దగ్గరగా కూర్చున్న అపరిచిత వ్యక్తి పేరును మీరు చెప్పలేరు. మీరిద్దరూ WA Notify ఉపయోగిస్తున్నట్లయితే, బస్సులో ప్రయాణిస్తున్న ఒక అపరిచితుడిని సంభావ్య ఎక్స్​ప్లోజర్​గురించి అలర్ట్ చేయవచ్చు మరియు వారి స్నేహితులు మరియు కుటుంబంలో కొవిడ్-19 వ్యప్తిని నిరోధించడానికి చర్యలు తీసుకోవచ్చు. చేతులను శుభ్రం చేసుకోవడం మరియు మాస్క్ ధరించడం వంటి ప్రతిదీ కూడా కొవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి సహాయపడుతుంది, అవన్నీ కలిసి మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

ఇతర యూజర్​లకు నోటిఫై చేయడానికి WA Notify కి ఎంత సమయం పడుతుంది?

మరో యూజర్ ద్వారా కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ కాగల యూజర్లు కొవిడ్-19 పాజిటివ్ అని టెస్ట్ చేసిన 24 గంటల్లోపు నోటిఫికేషన్ అందుకుంటారు, ఇతర WA Notify యూజర్లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లోని దశలు అనుసరిస్తాడు.

WA Notify నుండి పలు హెచ్చరికలు అందడం సాధ్యమేనా?

మరో యూజర్ ద్వారా కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ కాగల యూజర్లు కొవిడ్-19 పాజిటివ్ అని టెస్ట్ చేసిన 24 గంటల్లోపు నోటిఫికేషన్ అందుకుంటారు, ఇతర WA Notify యూజర్లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లోని దశలు అనుసరిస్తాడు.

నాకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలిందని నేను WA Notify కి ఎలా చెప్పాలి?

మీకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలితే ప్రజారోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కలుసుకుని, మీరు WA Notify ని వాడుతున్నారా అని అడుగుతారు. మీరు వాడుతుంటే, వారు మీకు ధృవీకరణ లింక్ మరియు/లేదా నోటిఫికేషన్​ని పంపుతారు మరియు WA Notify లోనికి నమోదు చేసేందుకు అనుసరించలాసిన దశల గురించి మీకు సాయపడతారు. లింక్ లేదా నోటిఫికేషన్ వ్యక్తి గుర్తింపుకు జతచేయబడదు. ఎక్స్​ప్లోజర్ గురించి యాప్ ద్వారా ఎవరికి నోటిఫై చేయబడుతుందనే విషయం పబ్లిక్ హెల్త్​కు ఏవిధంగానూ తెలియదు. ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​లో మీ గురించి ఎలాంటి సమాచారం జోడించబడదు. WA Notify లో ఎంత ఎక్కువమంది అనామధేయంగా వారి ఫలితాలను ధృవీకరిస్తారో, మనం కొవిడ్-19 వ్యాప్తిని అంత మెరుగ్గా నియంత్రించవచ్చు.

ఒకవేళ మీరు పాజిటివ్​గా టెస్ట్ చేయబడి, మీ ఫలితాలను WA Notify లను ధృవీకరించాల్సి ఉంటే, కొవిడ్-19 హాట్​లైన్​1-800-525-0127కు కాల్ చేసి, తరువాత #ని ప్రెస్ చేయాలి మరియు WA Notify కొరకు ప్రాంప్ట్​లను అనుసరించాలి.

WA Notify ని నా ఫోన్​కు చేర్చిన తర్వాత నేను చేయవలసినది ఏమైనా ఉన్నదా?

అదనపు చర్యలు అవసరమయ్యేది ఈ సందర్భాలలో మాత్రమే:

 1. మీకు కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలితే, లేదా
 2. మీరు ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చనే నోటిఫికేషన్​ను మీరు అందుకున్నారు.

మీకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలితే, ప్రజారోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కలుసుకుని, మీరు WA Notify ని వాడుతున్నారా అని అడుగుతారు. మీరు వాడుతుంటే, వారు మీకు ధృవీకరణ లింక్ మరియు/లేదా నోటిఫికేషన్​ని పంపుతారు మరియు WA Notify లోనికి నమోదు చేసేందుకు అనుసరించలాసిన దశల గురించి మీకు సాయపడతారు. లింక్ లేదా నోటిఫికేషన్ వ్యక్తి గుర్తింపుకు జతచేయబడదు. ఎక్స్​ప్లోజర్ గురించి యాప్ ద్వారా ఎవరికి నోటిఫై చేయబడుతుందనే విషయం పబ్లిక్ హెల్త్​కు ఏవిధంగానూ తెలియదు. ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్​లో మీ గురించి ఎలాంటి సమాచారం జోడించబడదు. WA Notify లో ఎంత ఎక్కువమంది అనామధేయంగా వారి ఫలితాలను ధృవీకరిస్తారో, మనం కొవిడ్-19 వ్యాప్తిని అంత మెరుగ్గా నియంత్రించవచ్చు.

మీరు ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చని WA Notify గుర్తిస్తే, మీ ఫోన్​లోని ఒక నోటిఫికేషన్ మీరు తదుపరి ఏమి చేయాలి అనే సమాచారంతో కూడిన వెబ్​సైట్​కు దారి చూపుతుంది. దీనిలో ఎలా, ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి అనేది, మీరు, మీకు సన్నిహితంగా ఉండేవారు సురక్షితంగా ఉండటానికి సంబంధించిన సమాచారం, మీ ప్రశ్నలకు సమాధానాలు లభించే వనరులు ఉంటాయి. ఆ వెబ్​సైట్​లోని సూచనలను శ్రద్ధగా చదివి, వాటిని పాటించడం ముఖ్యం. ఈ నోటిఫికేషన్​లో ఎవరి వలన లేదా ఎక్కడ మీరు ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చు అనే వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఉండదు. ఇది పూర్తి గా అజ్ఞాతంగా ఉంటుంది.

WA Notify ని ఉపయోగించడం వలన నా బ్యాటరీ హరించుకు పోవడం లేదా చాలా డేటాను వాడేయడం జరుగుతుందా?

లేదు. Bluetooth Low Energy సాంకేతికతను ఉపయోగించి దీనిని డేటాపైన, బ్యాటరీ జీవితంపైన కనీస ప్రభావాన్ని చూపేలా రూపొందించారు.

WA Notify పని చేయాలంటే నేను బ్లూటూత్​ను ఆన్ చేసి ఉంచడం అవసరమా?

అవును. WA Notify Bluetooth Low Energy ని ఉపయోగిస్తుంది, కాబట్టి ఈ వ్యవస్థ దగ్గరలోని ఇతర యూజర్​లను గుర్తించడం కోసం బ్లూటూత్ ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి.

ఇది పనిచేయడం కోసం నా ఫోన్​లో WA Notify ని తెరచి ఉంచాల్సిన అవసరం ఉందా?

లేదు. WA Notify నేపథ్యంలో పని చేస్తుంది.

WA Notify తప్పుడు పరీక్ష నివేదికలను ఎలా నిరోధించగలుగుతంది?

WA Notify కొరకు యూజర్లు ప్రభుత్వ వైద్య అధికారులు అందించే ధృవీకరణ లింక్ లేదా నోటిఫికేషన్ ఉపయోగించి అనామధేయంగా పాజిటివ్ టెస్ట్​ని ధృవీకరించాల్సి ఉంటుంది. లింక్ లేదా నోటిఫికేషన్ వ్యక్తి గుర్తింపుకు జతచేయబడదు. ధృవీకరణ లింక్ లేదా నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసిన తరువాత, WA Notify దగ్గరల్లోన్న యూజర్ల రాండమ్ కోడ్​ను మ్యాచ్ చేసి, సంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి వారికి తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్​లో మీరు ఎవరి వలన లేదా ఎక్కడ ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చు అనే వాటికి సంబంధించిన సమాచారం ఏదీ ఉండదు.

పాత స్మార్ట్​ఫోన్​లకు WA Notify మద్దతు ఇస్తుందా?

ఐఫోన్ వినియోగదారులు WA Notify ని ఉపయోగించగలగాలంటే మీకు ఉండాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్:

 • iOS వెర్షన్ 13.7 లేదా తరువాతది (iPhone 6s, 6s Plus, SE లేదా మరింత కొత్త వాటికి)
 • iOS వెర్షన్ 12.5 (iPhone 6, 6 plus, 5s కోసం)

ఆండ్రాయిడ్ యూజర్​లు WA Notify ని ఉపయోగించుకోవాలంటే, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్ బ్లూటూత్ లో ఎనర్జీని సపోర్ట్ చేసేట్లయితే, ఆండ్రాయిడ్ వెర్షన్ 6 (API 23) లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాలి.           

WA Notify ని ఉపయోగించడానికి నాకు 18 ఏళ్లు ఉండాలా?

లేదు. WA Notify కి మీ వయస్సు తెలియదు లేదామీ వయస్సును సరిచూడ లేదు.

నేను ఎవరితోనైనా ఫోన్​ను పంచుకుంటే ఈ సాంకేతికత పనిచేస్తుందా?

ఎక్స్​పోజ్ అయి ఉండే అవకాశం ఉన్న సమయంలో ఫోన్​ను ఎవరు ఉపయోగిస్తున్నారో WA Notify చెప్పలేదు. మీరు ఫోన్​ను పంచుకుంటూ ఉంటే, WA Notify కోవిడ్-19 ఎక్స్​పోజర్​కు అవకాశం ఉందని సూచిస్తే ఆ ఫోన్​ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ప్రజారోగ్య సూచనలను పాటించాలి.

iPadలు లేదా స్మార్ట్ వాచీల వంటి పరికరాల్లో WA Notify పని చేస్తుందా?

లేదు. ఎక్స్​పోజర్ నోటిఫికేషన్ ఫ్రేమ్​వర్క్ ప్రత్యేకించి స్మార్ట్​ఫోన్​ల కోసం రూపొందించబడినది, iPadలు లేదా టాబ్లెట్​లను సపోర్ట్ చేయదు.

స్మార్ట్ ఫోన్​లు లేని వ్యక్తులకు ఈ సాంకేతికత అందేలా చేయడానికి వాషింగ్టన్ రాష్ట్రం ఏమి చేస్తోంది?

WA Notify కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడే ఏకైక సాధనం కాదు. కాంటాక్ట్​లను కనిపెట్టడం తదితర చర్యలు వాషింగ్టన్ రాష్ట్ర వాసులు అందరికీ, వారికి స్మార్ట్​ఫోన్​లు లేకపోయినా, మేలు చేస్తాయి. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సిన్​లు అత్యుత్తమ మార్గం, మాస్క్​లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం మరియు సమావేశాల పరిమాణాన్ని పరిమితం చేయడం అనేవి కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి ప్రతి ఒక్కరూ సహాయపడే ఇతర మార్గాలు..

ఫెడరల్ గవర్నమెంట్ Lifeline program (లైఫ్​లైన్ ప్రోగ్రామ్) అర్హత కలిగినవారికి నెలవారీ ఫోన్ బిల్లు క్రెడిట్​ని అందిస్తుంది. కొంతమంది పాల్గొనే వైర్​లెస్ ప్రొవైడర్​లు ఉచిత స్మార్ట్​ఫోన్​ని కూడా అందించవచ్చు. ఎవరు అర్హత కలిగి ఉంటారు, ఎలా అప్లై చేయాలి మరియు పాల్గొనే వైర్​లెస్ ఆపరేటర్​ల గురించి మరింత తెలుసుకోండి (ఇంగ్లిష్ మాత్రమే).

కొవిడ్-19కు వ్యాక్సిన్ పొందడం అనేది వ్యాప్తి చెందకుండా ఆపడటానికి అత్యుత్తమ మార్గం అని గుర్తుంచుకోండి.

WA Notify చాలా ఎక్కువ బ్యాటరీ జీవితకాలాన్ని ఉపయోగించేలా ఎలా కనపడుతుంది?

వాస్తవానికి, బహుశా అది అలా చేయకపోవచ్చు. మీ పరికరంలో ఉండే బ్యాటరీ వాడకం WA Notify వంటి వాటితోసహా వివిధ యాప్​ల రోజువారీ బ్యాటరీ వాడకం శాతాలను చూపిస్తుంది. చాలా యాప్​లు రాత్రిపూట పనిచేయవు. WA Notify కూడా పని చేయదు, కానీ ఇది పాజిటివ్ వినియోగదారుకు సరిపోయే మ్యాచ్​ల కోసం ప్రతి కొన్ని గంటలకు ఒకసారి యాదృచ్ఛిక కోడ్​లను తనిఖీ చేస్తుంటుంది, తద్వారా అది మిమ్మల్ని సంభవనీయమైన ఏవైనా ఎక్స్​పోజర్​ల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి, ఉదాహరణకు, మీరు నిద్రిస్తున్నప్పుడు ఇతర యాప్​లు ఏవీ పని చేయకపోతే, ఆ సమయంలో WA Notify బ్యాటరీని అధిక శాతం ఉపయోగించినట్టు కనిపిస్తుంది. అలా అని WA Notify చాలా బ్యాటరీని ఉపయోగిస్తుందని దీని అర్థం కాదు - బ్యాటరీ వాడకంలోని ఒక చిన్న మొత్తంలో అధిక శాతం మాత్రమే.

వాషింగ్టన్ WA Notify ని 30కు పైగా భాషల్లో విడుదల చేసింది, అయితే Google Play storeలో కేవలం ఇంగ్లిష్ లేదా స్పానిష్ మాత్రమే కనిపిస్తోంది?

WA Notify వినియోగదారు ఫోన్​లో డిఫాల్ట్​గా సెట్ చేసిన భాష ఆధారంగా పనిచేస్తుంది. WA Notify కు కేవలం ఒకే ఒక వెర్షన్ ఉంది, కానీ ఏవైనా పాప్ అప్​లు – ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్, ఉదాహరణకు – వాషింగ్టన్ స్టేట్ అమలు చేసిన 30 కంటే ఎక్కువ భాషల్లో యూజర్ ఎంచుకునే భాషలో కనిపిస్తుంది.

నేను నోటిఫికేషన్ మరియు/లేదా టెక్ట్స్ అందుకున్నాను, అయితే పరీక్షించిన వ్యక్తి కుటుంబ లేదా ఇంటి సభ్యుడు. నేను ఏం చేయాలి?

పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ WA Notify యూజర్ ఎక్స్​ప్లోజ్ కాగల ఇతరులను అనామధేయంగా అలర్ట్ చేయడానికి దశలను అనుసరించాలి, తద్వారా మీ కొరకు ఉద్దేశించబడని ఏవైనా టెక్ట్స్​లు లేదా నోటిఫికేషన్​లను మీరు విస్మరించాలి.

మీ కుటుంబ లేదా గృహసభ్యుడు WA Notify యూజర్ అయి, టెస్ట్ ఫలితం పాజిటివ్​గా వచ్చి, వారి ఫలితాన్ని WA Notify లో ధృవీకరించాల్సి ఉంటే, వారు కొవిడ్-19 హాట్​లైన్​1-800-525-0127కు కాల్ చేసి, తరువాత #ని ప్రెస్ చేయాలి మరియు WA Notify కొరకు సూచనలను పాటించాలి. కాల్​కు సమాధానం ఇచ్చినప్పుడు, WA Notify ధృవీకరణ లింక్ కొరకు అడగండి.

నేను ఎంత సమయంలోపు నోటిఫికేషన్​ని తట్టాలి లేదా ధృవీకరణ లింక్​ని యాక్టివేట్ చేయాలి?

WA Notify లోని ఇతరులకు నోటిఫై చేయడానికి దశలను అనుసరించడానికి నోటిఫికేషన్ లేదా టెక్ట్స్ సందేశం అందుకున్న తరువాత మీకు 24 గంటలు ఉంటుంది. మీరు నిర్ధారిత సమయంలోగా నోటిఫికేషన్​ని తట్టకపోయినా లేదా ధృవీకరణ లింక్​ని క్లిక్ చేయలేకపోయినా, దయచేసి కొవిడ్-19 హాట్​లైన్​1-800-525-0127కు కాల్ చేయండి, తరువాత #ని ప్రెస్ చేయండి మరియు WA Notify కొరకు సూచనలను పాటించండి కాల్​కు సమాధానం ఇచ్చినప్పుడు, WA Notify ధృవీకరణ లింక్ కొరకు అడగండి. మీ కొవిడ్- 19 ఫలితాల గురించి పబ్లిక్ హెల్త్ మిమ్మల్ని సంప్రదించినప్పుడు కూడా మీరు లింక్‌ని అభ్యర్ధించవచ్చు.

వాషింగ్టన్ రాష్ట్రం ఈ పరిష్కారాన్ని ఎందుకు ఎంచుకుంది?

వాషింగ్టన్ రాష్ట్రం Apple/Google పరిష్కారాన్ని సమీక్షించడానికి భద్రత, పౌర స్వేచ్ఛల నిపుణులు, పలు ప్రజాసంఘాల సభ్యులతో కూడిన ఒక రాష్ట్రస్థాయి పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ యాప్ వేదికకు సంబంధించిన నిరూపితమైన విశ్వసనీయత, దృఢమైన డేటా పరిరక్షణ, ఇతర రాష్ట్రాల ఉపయోగం ఆధారంగా ఈ బృందం దీనిని స్వీకరించాలని సిఫారసు చేసింది.

ఉపాధి & వ్యాపారానికి సంబంధించిన వనరులు

నిరుద్యోగ ప్రయోజనాలు

మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే, మీరు నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హత పొందవచ్చు. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దావాను ఎలా పూరించాలో మీకు సమాచారం అవసరమైతే, మీరు 1-800-318-6022 కు కాల్ చేయవచ్చు. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి.

ఉద్యోగులు మరియు వ్యాపార యజమానులు

కరోనావైరస్ మహమ్మారి మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులను మరియు యజమానులను ప్రభావితం చేసింది.

ఉద్యోగులను సురక్షితంగా ఉంచడానికి, యజమానులు వీటిని చేయటం అవసరం:

 • COVID-19 యొక్క సంకేతాలు మరియు లక్షణాల గురించి వారి ఉద్యోగులకు వారు అర్థం చేసుకునే భాషలో అవగాహన కల్పించండి.
 • సామాజిక దూర ప్రణాళికను అమలు చేయండి.
 • తరచుగా శుభ్రపరచండి మరియు శానిటైజ్ చేయండి నిర్వహించండి.
 • తరచుగా మరియు సరిగ్గా చేతులు కడుక్కోవాలని నిర్ధారించుకోండి.
 • అనారోగ్య ఉద్యోగులు ఇంట్లోనే ఉండేలా చూసుకోండి.

వేతనంతో కూడిన అనారోగ్య సెలవు, వర్కర్ల పరిహారం మరియు పని ప్రదేశంలో భద్రత గురించి సంక్షిప్త సమాచారం Department of Labor & Industries నుండి అనేక భాషలలో అందుబాటులో ఉన్నాయి.

మీ కార్యాలయ భద్రత గురించి మీకు సమస్యలు ఉంటే, మీరు Department of Labor & Industries కి నేరుగా 800-423-7233 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ వ్యాఖ్యాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

COVID19 సమయంలో మీ వ్యాపారం మరియు ఉద్యోగుల గురించి మీకు ప్రశ్నలు ఉంటే, మీరు ఉపాధి భద్రతా విభాగానికి 855-829-9243 ద్వారా కాల్ చేయవచ్చు.

ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య భీమా వనరులు

మీరు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య భీమాకు అర్హత పొందవచ్చు. 1-855-923-4633 ద్వారా Health Care Authority కి కాల్ చేయండి. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి.

Alien Emergency Medical (AEM) కవరేజ్ అనేది అర్హత కలిగిన వైద్య అత్యవసర పరిస్థితి ఉన్న మరియు పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ అవసరాలను తీర్చని లేదా 5 సంవత్సరాల బార్ ను అందుకోని అర్హత కలిగిన వ్యక్తుల కోసం ఒక కార్యక్రమం.

1-800-322-2588 ద్వారా Help Me Grow వాషింగ్టన్ COVID-19 హాట్లైన్ మీకు అర్హత ఉన్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలను మరియు సేవలను గుర్తించగలదు మరియు మీరు దరఖాస్తు చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో ఇవి ఉన్నాయి:

 • WIC (మహిళలు, శిశువులు & పిల్లల పోషకాహార కార్యక్రమం)
 • పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పెద్దలకు ఆరోగ్య భీమా
 • Take Charge ప్రోగ్రామ్ ద్వారా జనన నియంత్రణ
 • ఆరోగ్య మరియు కుటుంబ నియంత్రణ క్లినిక్ లు
 • గర్భం మరియు శిశువు సరఫరాలు
 • తల్లి పాలివ్వటానికి మద్దతు
 • వారికి ఆహార కార్యక్రమాలు మరియు వనరులు కూడా ఉన్నాయి.
వలస మరియు శరణార్థుల సమాచారం

Office of Immigrant and Refugee Affairs (OIRA) కోవిడ్-19 మరియు ఇమ్మిగ్రెంట్ ఆందోళనల గురించి వాస్తవాలనుఅవగాహన చేసుకోవడంలో ఇమ్మిగ్రెంట్స్‌కు సహాయపడుతుంది. మరికొన్ని ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయాలు:

 • పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ స్థితిని ICE తో పంచుకోవడానికి ఆసుపత్రులు మరియు క్లినిక్లు అనుమతించబడవు.
 • COVID-19 కోసం పరీక్షించడం మరియు ఛారిటీ లేదా రాయితీ వైద్య సంరక్షణను పొందడంవళ్ళ గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు.
 • నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు చెల్లుబాటు అయ్యే సామాజిక భద్రతా సంఖ్య అవసరం. ఒకవేళ మీరు నిరుద్యోగ ప్రయోజనాలను పొందడం గురించి ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే 1-800-318-6022 కు కాల్ చేయండి.
 • నిరుద్యోగ ప్రయోజనాలను స్వీకరించడం మీ దరఖాస్తు సామర్థ్యాన్ని లేదా గ్రీన్ కార్డ్ ను లేదా పబ్లిక్ ఛార్జ్ నిబంధనల ప్రకారం పౌరసత్వం అప్లై చేసుకోవటానికి ఇబ్బంది కలిగించదు.
 • Covid-19 తో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మీరు శ్రద్ధ వహించడానికి లేదా మీరు వైరస్ కారణంగా అనారోగ్యంతో ఉంటే మీ గురించి జాగ్రత్తగా చూసుకోవడానికి వాషింగ్టన్ స్టేట్ పెయిడ్ ఫ్యామిలీ మరియు మెడికల్ లీవ్ కోసం అర్హత పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి మీకు సామాజిక భద్రతా సంఖ్య అవసరం లేదు. ESD అనేక ఇతర రకాల డాక్యుమెంటేషన్ ను అంగీకరిస్తుంది.
 • మీరు సహాయం కోరుకుంటున్న ఒక బిజినెస్ యజమాని అయితే, ఫెడరల్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి అత్యవసర లోన్ కోసం అప్లై చేయడం అనేది మీరు రెసిడెంట్ కార్డు లేదా నేషనాలిటీ పొందే అర్హతను చెడుగా ప్రభావితం చేయదు.

మీ లేదా మీ కుటుంబ సభ్యుడు లేదా మీ ప్రయోజనాల స్టేటస్ గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్, ఇమ్మిగ్రేషన్ అధికారి లేదా Department of Justice (DOJ) చేత గుర్తింపు పొందిన ఒక ప్రతినిధిని సంప్రదించమని Office of Immigrant and Refugee Affairs (OIRA) సిఫారసు చేస్తుంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ద్వారా మీరు ఒక లాయర్‌ను పొందవచ్చు లేదా మీరు DOJ-గుర్తింపు పొందిన సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

OIRAలో శరణార్థులు మరియు వలసదారులకు సహాయపడే కార్యక్రమాలు ఉన్నాయి:

 • ఉద్యోగ శోధన మరియు శిక్షణ.
 • ఇమ్మిగ్రేషన్ మద్దతు.
 • యూత్ మెంటరింగ్.
 • శరణార్థ పెద్దలు, పిల్లలు, విద్యార్థులు మరియు ఇతరులకు మద్దతు.
 • COVID-19 సమయంలో రెగ్యులర్ ప్రోగ్రామ్ లు రిమోట్ గా తెరిచి ఉంటాయి. ఉద్యోగాలు లేదా నిరుద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీ విద్యకు మద్దతు ఇవ్వడానికి మరియు గృహనిర్మాణానికి సహాయం అందించడానికి కార్యాలయంలో కొత్త సేవలు ఉన్నాయి. సెప్టెంబర్ 30, 2020 వరకు రెఫ్యూజీ క్యాష్ అసిస్టెన్స్ మరియు రెఫ్యూజీ మెడికల్ అసిస్టెన్స్ అర్హతను పొడిగించారు.
 • సేవలు మరియు మరింత సమాచారం కోసం, 360-890-0691కు కాల్ చేయండి.

వలసదారుల హక్కుల గురించి, అదుపులోకి తీసుకున్న బంధువులు/స్నేహితుల కోసం రిఫెరల్ సహాయం పొందడం మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం, మీరు 1-844-724-3737 ద్వారా వాషింగ్టన్ ఇమ్మిగ్రెంట్ సాలిడారిటీ నెట్వర్క్ హాట్లైన్ను సంప్రదించవచ్చు. ఫోన్ వివరణ అందుబాటులో ఉంది.

మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం

ఇది ఒత్తిడితో కూడుకున్నది అయ్యుండొచ్చు. మీరు లేదా మీ ప్రియమైనవారు ఆందోళన, విచారం, భయపడటం లేదా కోపంగా అనిపించడం సాధారణమే. మీరు ఒంటరి వారు కాదు. సహాయం కోరడం మరియు అడగడం సరైనదేనా.

ప్రతి ఒక్కరూ ఒత్తిడి మరియు క్లిష్ట పరిస్థితులకు భిన్నంగా స్పందిస్తారు. మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం మీ గురించి, మీ కుటుంబం మరియు మీ కమ్యూనిటీని మీకు సాధ్యమైనంత ఉత్తమంగా చూసుకోవడం.

సవాళ్ల సమయాల్లో ఎదుర్కోవటానికి మీకు ఏది సహాయపడుతుంది? మీరు స్నేహితులు మరియు కుటుంబంతో కలిసారా మరియు మాట్లాడారా? కొంతవరకు బాగా శ్వాస తీసుకోవడం మరియు స్ట్రెచింగ్స్ చేయడం, కొంత వ్యాయామం లేదా మంచి రాత్రి మంచి నిద్ర అవ్వచ్చు? స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని కేటాయించడం, అయితే ఆ సమయం మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

1-833-681-0211 ద్వారా Washington Listensకు కాల్ చెయ్యండి. ఫోన్ వ్యాఖ్యాన సేవలు అందుబాటులో ఉన్నాయి. COVID-19 మహమ్మారికి ప్రతిస్పందనగా, వాషింగ్టన్ Washington Listens అనే ఒక మద్దతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. Washington Listens సేవలను ఉపయోగించే వ్యక్తులు అధిక ఒత్తిడిని నిర్వహించడానికి మరియు COVID-19 కారణంగా మార్పులను ఎదుర్కోవటానికి మద్దతు పొందుతారు. సహాయ నిపుణుడితో మాట్లాడటానికి వాషింగ్టన్ లో ఎవరికైనా Washington Listens అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసే వారు వారి ప్రాంతంలోని కమ్యూనిటీ వనరులకు మద్దతు మరియు కనెక్షన్ను అందుకుంటారు. కార్యక్రమం పేరులేనిది.

మీరు సంక్షోభంలో ఉంటే మరియు కౌన్సెలింగ్ పొందడానికి ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉంటే, కొన్ని ఎంపికలు ఉన్నాయి.

 • ఏదైనా ప్రకృతి లేదా మానవుల వల్ల కలిగే విపత్తుకు సంబంధించిన మానసిక క్షోభను ఎదుర్కొంటున్న వ్యక్తులకు 1-800-985-5990 కు కాల్ చేయడం ద్వారా Disaster Distress Helpline తక్షణ సంక్షోభ సలహాను ఇస్తుంది. వారు స్పందించినప్పుడు, వ్యాఖ్యాన సేవలకు ప్రాప్యత పొందడానికి మీ భాష పేరును చెప్పండి. ప్రతిరోజూ హెల్ప్లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
 • Crisis Connectionsకు 24-గంటల సంక్షోభ రేఖను కలిగి ఉన్నాయి, ఇది మానసిక సంక్షోభంలో ఉన్న వ్యక్తులు, కుటుంబాలు మరియు వ్యక్తుల స్నేహితులకు తక్షణ సహాయంను అందిస్తుంది. ఇది King కౌంటీలో నివసించే ప్రజలకు సేవలు అందిస్తుంది. భాషా వివరణ అందుబాటులో ఉంది. 1-866-427-4747 కు కాల్ చేయండి.
 • National Suicide Prevention Lifeline ఆత్మహత్య గురించి ఆలోచించే వ్యక్తుల కోసం నివారణ మరియు సంక్షోభ వనరులను అందిస్తుంది. ప్రియమైన వారు కుటుంబం మరియు స్నేహితులకు సహాయపడటానికి వనరులను పొందడానికి లైఫ్లైన్కు కాల్ చేయవచ్చు. 1-800-273-8255కు కాల్ చేయండి. ఈ హాట్లైన్ రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది. అనుభవజ్ఞుల కోసం ఒక నిర్దిష్ట హెల్ప్లైన్ ఉంది. 1-800-273-8255 కు కాల్ చేసి, ఆపై 1 నొక్కండి. మీరు చెవిటివారు మరియు సరిగ్గా వినపడనివారైతే, 1-800-799-4889 కు కాల్ చేయండి.
ఆహార వనరులు

మీకు 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉంటే వారు పాఠశాలల నుండి ఉచిత ఆహారాన్ని పొందవచ్చు. విద్యా కార్యక్రమాలలో చేరిన వైకల్యాలున్న పెద్దలు పాఠశాల భోజనానికి కూడా అర్హత పొందవచ్చు. అనేక సందర్భాల్లో, ఈ భోజనం బస్ స్టాప్ వంటి ఆఫ్-స్కూల్ ప్రదేశాలలో పంపిణీ చేయబడుతోంది లేదా అందించబడుతుంది. వారు ఉచిత భోజనం అందిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీ పాఠశాల జిల్లాను సంప్రదించండి.

గర్భిణీలు, కొత్త తల్లులు మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, మీరు Department of Health యొక్క మహిళలు, శిశువులు మరియు పిల్లలు (WIC) కార్యక్రమం ద్వారా ఆహారాన్ని పొందవచ్చు. భాషా సహాయం కోసం, 1-866-632-9992 కు కాల్ చేయండి.

Covid-19 సమయంలో ఆహారంలో డిమాండ్ పెరిగినందున ఫుడ్ బ్యాంకులు తమ గంటలను మార్చవచ్చు లేదా వాక్-ఇన్ ట్రాఫిక్ మూసివేయబడవచ్చు. వెళ్ళడానికి ముందు కాల్ చేయండి. Northwest Harvest అనేది రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ బ్యాంక్ నెట్వర్క్. ఈ వెబ్సైట్లోని గ్రీన్ బాక్స్ కు ఎడమ బాక్స్ లో మీ నగరం పేరును టైప్ చేయండి.

మీరు తూర్పు వాషింగ్టన్ లో నివసిస్తుంటే Second Harvest వద్ద ఆహార బ్యాంకుల జాబితాను కనుగొనవచ్చు. మీ ప్రాంతంలోని ఆహార బ్యాంకుల జాబితా కోసం ఈ వెబ్సైట్లో మీ కౌంటీని ఎంచుకోండి.

బేసిక్ ఫుడ్ బెనిఫిట్ కార్డ్స్

ఆహారం కొనడానికి బేసిక్ ఫుడ్ బెనిఫిట్ (EBT) కార్డ్స్ ఉపయోగించవచ్చు మరియు ఇవి ఒక పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. యుఎస్ పౌరులు ఈ ప్రయోజనం కోసం Washington State Department of Social and Health Services (DSHS) వెబ్‌సైట్ లోని బేసిక్ ఫుడ్ పేజి లో అప్లై చేయవచ్చు.

గమనిక: ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వయోజనులకు వర్తించే పని ఆవశ్యకాన్ని ఫెడరల్ ప్రభుత్వం తాత్కాలికంగా ఆపివేసింది. అయినప్పటికీ, ఈ ప్రయోజనం పొందడానికి మీరు యుఎస్ పౌరులు అయి ఉండాలని ఫెడరల్ ప్రభుత్వం కోరుతున్నది.

ఇతర ప్రోగ్రామ్ ఆవశ్యకాలు అన్నీ సంతృప్తిపరచే అనేక మంది నాన్-సిటిజన్స్‌కు పైన వివరించినటువంటి డెట్-స్టైల్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ప్రయోజనం కోసం DSHS స్టేట్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అప్లై చేయవచ్చు (ఇంగ్లీషులో మాత్రమే).

కుటుంబాలకు వనరులు మరియు సమాచారం

ఇది మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. మీ పిల్లలతో ఈ పరిస్థితిని ఎలా నిర్వహించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

కుటుంబ చర్చలను సౌకర్యవంతమైన ప్రదేశంలో చేసుకోండి మరియు కుటుంబ సభ్యులను ప్రశ్నలు అడగమని ప్రోత్సహించండి. చిన్న పిల్లలతో వారు అర్థం చేసుకోగలిగే భాషను ఉపయోగించటానికి మరియు వారి నిర్దిష్ట భయాలు లేదా అపోహలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్చను పరిగణించండి.

మీకు సమాచారం చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ, భయం లేదా భయాందోళనలను ప్రోత్సహించే మీడియా సంస్థలు లేదా సోషల్ మీడియాకు గురికావడాన్ని తగ్గించండి. మహమ్మారి గురించి తెలుసుకోవడానికి మీ పిల్లలు మీడియా కవరేజ్ లేదా సోషల్ మీడియాకి సమయం ఎంత వెచ్చిస్తున్నారు (మరియు పరిమితం చేయండి).

ప్రశ్నలను ప్రోత్సహించడం ద్వారా మరియు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటం ద్వారా పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టండి.

 • వారి భావాల గురించి మాట్లాడండి మరియు వాటిని ధృవీకరించండి.
 • డ్రాయింగ్ లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వారి భావాలను వ్యక్తపరచడంలో వారికి సహాయపడండి.
 • వైరస్ ఎలా వ్యాపించిందనే దానిపై తప్పుడు సమాచారం లేదా అపార్థాలను మరియు ప్రతి శ్వాసకోశ వ్యాధి COVID-19 కి కారణమయ్యే నోవల్ కరోనావైరస్ కాదు అని స్పష్టం చేయండి.
 • సౌకర్యాన్ని మరియు కొంచెం అదనపు సహనాన్ని అందించండి.
 • మీ పిల్లలతో రోజూ లేదా పరిస్థితి మారినప్పుడు తిరిగి తెలుసుకోండి.
 • నిద్రవేళలు, భోజనం మరియు వ్యాయామం విషయానికి వస్తే మీ కుటుంబ షెడ్యూల్ ను స్థిరంగా ఉంచండి.
 • ఇంట్లో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఇతర ఒత్తిడితో కూడిన పరిస్థితులలో మంచి అనుభూతిని కలిగించే పనులను ఇంట్లో చేయడానికి సమయం కేటాయించండి ఎటువంటివి అంటే చదవడం, సినిమాలు చూడటం, సంగీతం వినడం, ఆటలు ఆడటం, వ్యాయామం చేయడం లేదా మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం(ఇంటర్నెట్ లో ప్రార్థన, సేవల్లో పాల్గొనడం).
 • ఒంటరితనం, విసుగు, వ్యాధి సంభవిస్తుందనే భయం, ఆందోళన, ఒత్తిడి మరియు భయం వంటి భావాలు మహమ్మారి కారణంగా ఒత్తిడితో కూడిన పరిస్థితికి సాధారణ ప్రతిచర్యలు అని గుర్తించండి.
 • మీ కుటుంబం మరియు సాంస్కృతిక విలువలకు అనుగుణంగా ఆహ్లాదకరమైన మరియు అర్ధవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీ కుటుంబానికి సహాయం చేయండి.
అదనపు వనరులు మరియు సమాచారం

Washington State Commission on Asian Pacific American Affairs (CAPAA)